
ములుగు, 30 మార్చి (హి.స.)
ములుగు చౌరస్తా వద్ద గత రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. గజ్వేల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఈ వాహనంలో 18 పశువులను క్రూరంగా కుక్కి తరలిస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు తనిఖీ చేయడానికి ముందే డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. వాహనం యజమాని మహారాష్ట్రకు చెందిన అజీజ్ లడకు అని పోలీసులు తెలిపారు. పశువుల రవాణాకు అవసరమైన ఎటువంటి అనుమతులు, లైసెన్స్లు, వెటర్నరీ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేవని వెల్లడించారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, పశువులను సమీప గోశాలకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..