
న్యూఢిల్లీ, 30 మార్చి (హి.స.)హిమాచల్ ప్రదేశ్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం కేసులో కింది కోర్టులు బాధితురాలి పేరును రికార్డుల్లో ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రికార్డుల్లో బాధితులు, వారి కుటుంబీకుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తావించకూడదని అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి చట్టాలున్నప్పటికీ, సుప్రీం కోర్టు పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ.. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని దర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. దిగువ కోర్టు ఉత్తర్వులో మైనర్ బాధితురాలి పేరును ప్రస్తావించిన విషయాన్ని గమనించి కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ