హార్మూజ్ జలసంధిలో భారత్ ఆపరేషన్ ఊర్జా సురక్ష
న్యూఢిల్లీ, 30 మార్చి (హి.స.) మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ తన ఇంధన భద్రత కోసం హార్మూజ్ జలసంధి వద్ద అత్యంత కీలకమైన ఆపరేషన్ ఊర్జా సురక్ష (Operation U
Operation


న్యూఢిల్లీ, 30 మార్చి (హి.స.) మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ తన ఇంధన భద్రత కోసం హార్మూజ్ జలసంధి వద్ద అత్యంత కీలకమైన ఆపరేషన్ ఊర్జా సురక్ష (Operation Urja Suraksha) ను ప్రారంభించింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం వాటా (Strait of Hormuz) కలిగిన ఆర్మూస్ జలసంధి4 గుండా భారత్కు వచ్చే క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ (LPG), ఎల్ఎన్జ (LNG) నౌకలకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం.

ఈ ఆపరేషన్ లో భాగంగా భారత నౌకాదళం తన అత్యున్నత స్థాయి యుద్ధనౌకలను హార్మూజ్ జలసంధి సమీపంలో మోహరించింది. సుమారు ఐదుకు పైగా ఫ్రంటైన్ యుద్ధనౌకలు నిరంతరం పహారా కాస్తూ, భారత జెండా కలిగిన ఇంధన నౌకలకు 'రక్షణ కవచం' (Escort)గా నిలుస్తున్నాయి. కేవలం భౌతిక రక్షణే కాకుండా, యుద్ధం కారణంగా తలెత్తే GPS జామింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి రియల్-టైమ్ నావిగేషన్ సపోర్ట్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రక్షణను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 20 ఇంధన నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను భారత నౌకాదళం తీసుకుంది. ఇప్పటికే 'పైన్ గ్యాస్' మరియు 'జగ్ వసంత్' వంటి భారీ ఎల్పీజీ నౌకలు సుమారు 92,000 టన్నుల గ్యాస్తో హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటడం ఈ ఆపరేషన్ యొక్క తొలి విజయంగా చెప్పవచ్చు.

హార్మూజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు (Blockade), సముద్రంలో మైన్ల హెచ్చరికలు, షిప్పింగ్ ట్రాఫిక్ తగ్గిపోవడం వంటి సవాళ్లను అధిగమించడానికి భారత్ ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. భారత్ తన దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, క్షేత్రస్థాయిలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ 'ఆపరేషనల్' రక్షణను కల్పిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande