నియోజకవర్గాల పునర్విభజన.. ఉమ్మడి నల్గొండలో మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం..
నల్గొండ, 30 మార్చి (హి.స.) దేశంలో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఎక్కడ ఏ నియోజకవర్గం పేరుతో అసెంబ్లీ స్థానం పెరగనుంది..? ఏ ఏయే మండలాలు ఏ నియోజకవర్గంలో వ
పునర్విభజన


నల్గొండ, 30 మార్చి (హి.స.)

దేశంలో లోక్ సభ, అసెంబ్లీ

నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఎక్కడ ఏ నియోజకవర్గం పేరుతో అసెంబ్లీ స్థానం పెరగనుంది..? ఏ ఏయే మండలాలు ఏ నియోజకవర్గంలో విలీనం చేయనున్నారోనని రాజకీయ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల లోపు ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. రానున్న పార్లమెంట్ సమావేశాలలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ స్థానాల పెంపులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాల్లో ఒక్కో పార్లమెంటు స్థానానికి రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున పెరిగే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ప్రధానంగా 2009 కంటే ముందు అసెంబ్లీ కేంద్రంగా ఉన్న రామన్నపేట నియోజకవర్గం ఏర్పాటు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్వాతంత్రం అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉండేది కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు హుజూర్నగర్ నియోజకవర్గ ఆనవాలు కోల్పోయింది. కానీ 2009 పునర్విభజన పేరుతో పాత నియోజకవర్గ కేంద్రంగా హుజూర్నగర్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామన్నపేట కు అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఒకవేళ రామన్నపేట నియోజకవర్గము కాకపోతే చౌటుప్పల్ కేంద్రంగా నియోజకవర్గ ఏర్పడేందుకు అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తుంగతుర్తి 9 మండలాలతో కొనసాగుతోంది. నియోజకవర్గం అయితే విశాలమైన ఈ నియోజకవర్గ నుంచి మోత్కూర్ కేంద్రంగా నియోజకవర్గ ఏర్పడేందుకు అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, నల్లగొండ రూరల్ మండలం కలిపి నల్లగొండ అర్బన్ నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దాంతోపాటు జనాభాలో నల్లగొండ తో పాటు సరిసమానంగా కొనసాగుతున్న మిర్యాలగూడ మున్సిపాలిటీ, మిర్యాలగూడ రూరల్ మండలం కలిపి మిర్యాలగూడ అర్బన్ నియోజకవర్గం పేరుతో ఓ కొత్త నియోజకవర్గం పురుడు పోసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నల్లగొండ జిల్లాలో అత్యధికంగా గిరిజన జనాభా కలిగిన నియోజకవర్గాలు దేవరకొండ, మిర్యాలగూడ , నాగార్జునసాగర్ ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల నుంచి పాత చలకుర్తి నియోజకవర్గం పేరుతో మరొక నియోజకవర్గం ఏర్పడింది కూడా అవకాశాలున్నట్లు సమాచారం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం జనాభా 17.54 లక్షలు ఉంది . 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం వెల్లడైన సమాచారం. అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు ప్రభుత్వం నిర్వహించాలి. కానీ 2021లో కరోనా వైరస్ కారణంగా జన గణన చేయకపోవడం వల్ల పెరిగిన జనాభా బయట గతం కాలేదు. ఈ సంవత్సరం నిర్వహించబోయే జనగణన లో పెరిగిన జనాభా లెక్కలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఓట్ల నమోదు కార్యక్రమం ఉంటున్నందున ఎప్పటికప్పుడు ఓటర్ల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారుల లెక్కల ప్రకారం 29,09,028 ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం విదితమే.

ఉమ్మడి నల్లగొండ జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసం నాటి గత ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలుగా విభజించింది. అయితే ప్రస్తుతం నల్గొండ, భువనగిరి కేంద్రాలుగా పార్లమెంటు స్థానాలు కొనసాగుతున్నాయి. అయితే సూర్యాపేట జిల్లా కేంద్రం కూడా పార్లమెంటు స్థానంగా ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నట్లు చర్చ జరుగుతుంది. అయితే ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య దాదాపు 29 లక్షలకు పైగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గాల వైశాల్యం కూడా ఎక్కువ దూరం కలిగి ఉండడంతో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సూర్యాపేటను పార్లమెంట్ స్థానంగా ప్రకటించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా మూడు జిల్లాల పేరుతో మూడు పార్లమెంట్ స్థానాలు ఉంటే బాగుంటుందని కూడా ప్రజలు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande