నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అమలు చేయాలంటూ కలెక్టర్ కు రైతుల విజ్ఞప్తి
సంగారెడ్డి, 30 మార్చి (హి.స.) సంగారెడ్డి జిల్లాలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అమలు పరిస్థితి తీవ్రంగా నిరాశ కలిగిస్తున్నదని, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు బి. కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం ప్రజా వేదిక కార్యక్రమం ద్వారా
Collector


సంగారెడ్డి, 30 మార్చి (హి.స.)

సంగారెడ్డి జిల్లాలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అమలు పరిస్థితి తీవ్రంగా నిరాశ కలిగిస్తున్నదని, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు బి. కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం ప్రజా వేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుటుంబంలో ప్రధాన ఆర్జనదారుడు మరణించినప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాలకు సహాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ కీలక పథకం సంగారెడ్డి జిల్లాలో సరైన విధంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 15 మంది లబ్ధిదారులకు మాత్రమే ఎన్ఎఫ్బీఎస్ కింద సహాయం అందిందని, ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని, అమలు విధానం పై అనేక సందేహాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14,000 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సమాచారం ప్రకారం ప్రతి జిల్లాలో సుమారు 1,000 అర్హత గల కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం అందించే అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లాలో ఇంత తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande