తెలంగాణ హేట్ స్పీచ్ బిల్లుపై అధికార, విపక్షాల రచ్చ..
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో హేట్ స్పీచ్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. హేట్ స్పీచ్ పేరుతో వాక్ స్వేచ్ఛపై హక్కుపై కత్తిని పెడుతోందని విపక్షాలు విమర్శిస్తుండగా మానవ హక్కులను హరించే అంశాలు ఈ బిల్లులో లేవని ప్రభుత్వం చెబుతోంది. ఈ
Hate speech


హైదరాబాద్, 30 మార్చి (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో హేట్

స్పీచ్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. హేట్ స్పీచ్ పేరుతో వాక్ స్వేచ్ఛపై హక్కుపై కత్తిని పెడుతోందని విపక్షాలు విమర్శిస్తుండగా మానవ హక్కులను హరించే అంశాలు ఈ బిల్లులో లేవని ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లులోని నిబంధనలు, శిక్షలు, పౌరహక్కులపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది.

వాట్సాప్ గ్రూప్ సభ్యులందరిపై చర్యలు తీసుకునేలా ఉంది: బీజేపీ

శాంతిభద్రతల పేరుతో తీసుకువస్తున్న హేట్ స్పీచ్ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి హానికరం అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ బిల్లులోని శిక్షలకు ముందస్తు బెయిల్ ఉండదని, రాజకీయ ప్రత్యర్థులను నియంత్రించేందుకు తీసుకువస్తున్న ఈ బిల్లు ఇవాళ మీకు బాగానే అనిపించవచ్చు. కానీ అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని మీరు ప్రతిపక్షంలోకి రాగానే ఈ బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉందన్నారు. బతికున్నవారిమీదనే భరోసా లేని ఈ సమాజంలో చనిపోయిన వ్యక్తుల మీదనో, నిజాంపాలకుల మీదనో, మరెవరో రచయితల మీదనో మాట్లాడినా కూడా కేసులు పెట్టేలా నిబంధనలు ఇందులో ఉన్నాయన్నారు. ఇలాంటి చట్టాలు చేసే ముందు ఆలోచించుకోవాలన్నారు. ఇందులోని సెక్షన్ 4 ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ లాంటిదన్నారు. ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ వేసే

పోస్టుకు గ్రూప్ లోని సభ్యులందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదన్నారు.

ఈ హేట్ స్పీచ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నానని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇది రాజకీయాలతో సంబంధించినదని కాదని భావ స్వేచ్ఛ, భాషా, కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగాలపై దాడులు చేయడానికి బ్రిటీష్ కాలంలో అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్నారు. ఇటువంటి బిల్లులు ఉండేవని ఈ బిల్లులో సరైన స్పష్టం తేలదన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేతిలో ప్రజాస్వామ్యం బంధిగా ఉందని దీనికి తోడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడైతే ఇక చెప్పుకోవడానికి ఏమీ ఉండదన్నారు. ఉపా చట్టం కింద ఎవరినైనా ఎప్పుడైనా లోపల పెడుతున్నారు. ఎన్ఐఏ ఎవరినైనా అరెస్టు చేస్తున్నారు.

సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ప్రతిపాదించిన ఈ బిల్లుపై ఇవాళ సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యుల నుంచి వ్యక్తం అయిన సందేహాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. మానవ హక్కులను హరించే విషయాలు ఈ బిల్లులో లేవని స్పష్టం చేశారు. కక్ష సాధింపుకోసమే, ఎవరికో అన్యాయం చేసే ఉద్దేశం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కు సంబంధించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు ఎలాంటి భంగం కలిగించదన్నారు. ఈ బిల్లు విషయంలో విపక్ష సభ్యుల ఆలోచనలో పొరపాటు ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం చాలా తప్పు అన్నారు. ఈ బిల్లులోని అంశాలు అందరికీ వర్తిస్తాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande