
యాదాద్రి భువనగిరి, 30 మార్చి (హి.స.) ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 30 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 25, జిల్లా గ్రామీణాభివృద్ధి 2, హౌసింగ్ 2,మున్సిపాలిటీ ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జడ్పీ సి.ఈ.ఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..