ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదు : ఆళ్ల రామకృష్ణకు హైకోర్టు షాక్!
అమరావతి, 30 మార్చి (హి.స.)మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు కీలక పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల కేసులో దాఖలైన ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదని న్యాయస్థానం స్ప
ేే


అమరావతి, 30 మార్చి (హి.స.)మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు కీలక పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల కేసులో దాఖలైన ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును రాష్ట్ర ఏజెన్సీల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాలని కోరుతూ ఆళ్ల దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. అయితే.. ఈ అభ్యర్థనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతం ఏసీబీ (ACB) కోర్టులో ఉన్న ఈ కేసు విచారణను, ఎంపీలు-ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన మూడవ పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టివేసింది.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లకు చట్టబద్ధంగా విచారణార్హత లేదని అభిప్రాయపడింది. రాజకీయ కారణాలతో లేదా ఇతర ఉద్దేశాలతో వేసిన పిటిషన్లుగా భావించి, వీటిని కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నిందితులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande