మహానంది.హుండీ ఆదాయం 31 రోజుల్లో. 32,29లక్షలు
మహానంది: 30 మార్చి (హి.స.) సుప్రసిద్ధ మహానంది పుణ్యక్షేత్రంలోని హుండీల్లో భక్తులు 31 రోజుల్లో రూ.32,29,396లను సమర్పించినట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం బండి ఆత్మకూరు గ్రూప్ టెంపుల్ నాగప్రసాద్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ జ
మహానంది.హుండీ ఆదాయం 31 రోజుల్లో. 32,29లక్షలు


మహానంది: 30 మార్చి (హి.స.) సుప్రసిద్ధ మహానంది పుణ్యక్షేత్రంలోని హుండీల్లో భక్తులు 31 రోజుల్లో రూ.32,29,396లను సమర్పించినట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం బండి ఆత్మకూరు గ్రూప్ టెంపుల్ నాగప్రసాద్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా పలు ఆలయాలు అన్నదాన కేంద్రం, గో సంరక్షణ హుండీలను లెక్కించగా.. ఈ ఆదాయం వచ్చినట్లు వివరించారు. ఈ లెక్కింపులో దేవస్థానం ఏఈఓ ఎర్రమల మధు, పర్యవేక్షకులు అంబటి శశిధర రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పసుపుల సుబ్బారెడ్డి , ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, దేవస్థానం సిబ్బంది, పలు ప్రాంతాలకు చెందిన సేవకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande