శాసనమండలిలో హైడ్రామా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) తెలంగాణ శాసనమండలి వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్సీలు భారీ నిరసన చేపట్టారు. మంత్రి తక్ష
Brs


హైదరాబాద్, 30 మార్చి (హి.స.)

తెలంగాణ శాసనమండలి వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్సీలు భారీ నిరసన చేపట్టారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మండలి భవనం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని, లేదంటే తమ పోరాటం వీడబోమని స్పష్టం చేశారు. మార్షల్స్ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం సరికాదని వారు ధ్వజమెత్తారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారడంతో, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సభా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande