దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు.. సుప్రీం తీర్పుపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
అమరావతి, 30 మార్చి (హి.స.) దళితులు క్రిస్టియన్గా మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుంతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. క్రిస్టియన్ గా మారితే ఎస్సీ హోదా రద్దు చ
mandakrishnas-sensational-comments-on-cancellation-of-sc-status-for-dalit-


అమరావతి, 30 మార్చి (హి.స.)

దళితులు క్రిస్టియన్గా మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుంతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. క్రిస్టియన్ గా మారితే ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఈ పార్లమెంట్కు, న్యాయవ్యవస్థకు, రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే కుల వ్యవస్థ రద్దు చేయాలన్నారు. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని అయితే ఈ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని ఇవి వివక్షతో కూడిన ఉత్తర్వులు అన్నారు. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యల కోసం ముందుకు ఏ పార్టీ, ఏ సంస్థ తీసుకున్నా దానిని స్వాగతిస్తామని, వారికి అండగా నిలబడతామన్నారు.

ఈ కుల వ్యవవస్థలో అత్యంత బాధితులు దళితులేనని, పశువులకంటే హీనంగా చూడబడ్డది దళితులేనన్నారు. ఈ దేశ కులవ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్ని బాధితులేనన్నారు. కుల వ్యవస్థలో ఏ రెండు కులాల మధ్య సాఘీక సామరస్యత లేదు. కానీ అన్నీ కులాల మీద ఆధిపత్యం, గౌరవం పొందుతున్నది మాత్రం బ్రాహ్మణ వ్యవస్థ అన్నారు. తాము కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కుల వ్యవస్థను ఏ రాజకీయ పార్టీ సమర్ధిస్తదో బహిరంగ పరచాలన్నారు. అసృశ్యత ఏ వ్యవస్థ నుంచి రాజకీయ పార్టీలు బహిరంగ పరచాలన్నారు. సమానత్వాన్ని కోరుకునే కుల వ్యవస్థ రద్దు చేయాలని కోరుకుంటారు. సమాజంలో అసమానతలను కోరుకునే వారు కుల వ్యవస్థను కోరుకుంటారు. అందువల్ల కుల వ్యవస్థ ఉండాలనుకునే వారెవరో, కుల వ్యవస్థ రద్దు కోరుకునే వారెవరో బహిరంగంగా రావాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande