రూపాయి మరింత బలహీనపడొచ్చు
ముంబై, ,30జనవరి (హి.స.) పశ్చిమాసియా యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నందున, అక్కడ నుంచి మన దేశానికి వచ్చే నిధులు (రెమిటెన్సెస్) తగ్గుతున్నట్లు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ రూపొందించిన ‘2026 మిడిల్ఈస్ట్ కాన్ఫ్లిక్ట్
Rupee Dollar Exchange Rate


ముంబై, ,30జనవరి (హి.స.) పశ్చిమాసియా యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నందున, అక్కడ నుంచి మన దేశానికి వచ్చే నిధులు (రెమిటెన్సెస్) తగ్గుతున్నట్లు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ రూపొందించిన ‘2026 మిడిల్ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్’ నివేదిక వెల్లడించింది. దీంతో పాటు ముడిచమురు ధర దీర్ఘకాలం పాటు అధికంగానే ఉంటే, కరెంటు ఖాతాలోటు పెరుగుతుందని, రూపాయి మరింత బలహీన పడుతుందని వివరించింది.

రెమిటెన్సెస్లో 38% గల్ఫ్ నుంచే

గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఉంటున్న భారతీయులు, ఇక్కడి తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నిధులను పంపుతుంటారు. అక్కడి ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవి తగ్గే అవకాశం ఉందని తెలిపింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే నిధుల్లో 38% వాటా గల్ఫ్ ప్రాంతానిదే. అందులో సగం యూఏఈ నుంచే వస్తాయి. ఇప్పుడు అక్కడ ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నందున, అక్కడి కార్మికులు.. ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్పవని.. ఫలితంగా వారు మన దేశానికి పంపే నిధుల్లో మందగమనం ఉంటుందని వివరించింది.

ముడి చమురు ధర పెరగడం వల్ల, మనదేశానికి దిగుమతుల బిల్లు భారం అధికమవుతుంది. ఎగుమతులు బలహీన పడుతున్నందున, కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) పెరిగేందుకు ఇది కారణమవుతుంది. ఫలితంగా డాలర్తో పోలిస్తే, రూపాయి మారకపు విలువ మరింత తగ్గొచ్చు. ఎరువులపై సబ్సిడీకి అధికంగా వెచ్చించాల్సి రావడం వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడొచ్చు. ముడి చమురు ధర బ్యారెల్కు 10 డాలర్లు అధికమైతే, దేశ వార్షిక కరెంట్ ఖాతా లోటు 15 బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని అంచనా. ముడి చమురు ధర దీర్ఘకాలం పాటు బ్యారెల్కు 100 డాలర్ల దగ్గరగా ఉంటే, కరెంటు ఖాతా లోటు బాగా ఎక్కువ కావచ్చు. కరెంట్ ఖాతా లోటు 70 బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande