
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రజా విహార ప్రదేశమైన ఇందిరా పార్కులో కబ్జాలపై హైడ్రా అధికారులు కఠినంగా స్పందించారు. లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఈ పార్కులో పాత స్కేటింగ్ రింగ్ స్థలాన్ని ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకొని, ఆ ప్రాంతాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టారు. ప్రజావాణిలో వాకర్స్ నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అధికారిక లేకుండా నిర్మాణ పనులు ప్రారంభించడం, పార్కు ప్రహరీని తొలగించడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే నిర్మాణాలను నిలిపివేయాలని, తొలగించిన ప్రహరీను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశించారు. కొత్త స్కేటింగ్ రింగ్ అందుబాటులోకి రావడంతో పాత రింగ్ ఖాళీగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చింది. అనుమతులు
సమ్మర్ క్యాంప్ పేరుతో కరాటే శిక్షణ ప్రారంభించిన వ్యక్తి, తర్వాత అదే ప్రదేశాన్ని శాశ్వత శిక్షణా కేంద్రంగా మార్చి ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా, స్థలాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలిసింది. సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణ పనులు చేపట్టడం, నిర్మాణ సామగ్రి డంప్ చేయడం, జేసీబీ ప్రవేశం కోసం ప్రహరీని కూల్చివేయడం వంటి చర్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. ఈ ఘటనపై దోమలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. పాత స్కేటింగ్ రింగ్ స్థలాన్ని పూర్తిగా ఇందిరా పార్కులో విలీనం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, భవిష్యత్తులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..