తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరన ఏజెన్సీ టోల్ గేట్ సమీపంలో టాటా సుమో.దగ్దం
తిరుమల రెండో ఘాట్రోడ్డు సమీపంలో టాటాసుమో దగ్దమైంది
తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరన ఏజెన్సీ టోల్ గేట్ సమీపంలో  టాటా సుమో.దగ్దం


తిరుమల,03 ఏప్రిల్ (హి.స.) రెండో ఘాట్రోడ్డు చివరన జీఎన్సీ టోల్గేట్కు సమీపంలో టాటాసుమో దగ్ధమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. తిరుమల ట్రాఫిక్ ఎస్సై గౌరిశంకర్ తెలిపిన వివరాలమేరకు.. తిరుపతిలోని ఎల్బీనగర్కు చెందిన లవకుమార్ టాటాసుమోను ట్యాక్సీగా ఉపయోగిస్తున్నాడు. సాయంత్రం అలిపిరి నుంచి బయలుదేరిన అతను జీఎన్సీ టోల్గేట్కు సమీపంలో వస్తుండగా బ్యాటరీవద్ద షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే డ్రైవర్ దిగిపోయారు. కారు దగ్ధం కావడంతో 100కు ఫోన్ చేయగా పోలీసుశాఖ, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపుచేశారు. అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande