బాలాయపల్లి మండలంలోని మేల్చూరు కూడలిలో. ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీ కొని వ్యక్తి మరణం
బాలాయపల్లి మండలంలోని మేల్చూరు కూడలిలో. ఘోర రోడ్డు ప్రమాదం


నాయుడుపేట 03 ఏప్రిల్ (హి.స.)బాలాయపల్లి, మండలంలోని మేల్చూరు కూడలిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందగా.. బస్సు దహనమైంది. 38 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసుల వివరాలిలా.. నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే వారిని వెంకటగిరికి బస్సులో తీసుకెళ్తుండగా.. ఓజిలి మండలం అత్తివరానికి చెందిన ప్రదీప్రెడ్డి (40) బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనం మాత్రం బస్సు కింది భాగంలో ఇరుక్కొని కొంతదూరం లాక్కెళ్లడంతో నిప్పురవ్వలు పెట్రోలు బాక్స్కు తగిలి మంటలు బస్సుకు అంటుకున్నాయి. డ్రైవర్ బస్సును ఆపేయడంతో అందులోని ఉద్యోగులంతా దిగేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారని స్థానిక సీఐ వెంకటరమణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande