ఆర్టీసీ లాభాల బాటలో కొనసాగుతుంది: మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట, 31 మార్చి (హి.స.) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని, విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతమైనందుకు మక్తల్ బస్టాండ్లో ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ
మంత్రి వాకిటి


నారాయణపేట, 31 మార్చి (హి.స.) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని, విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతమైనందుకు మక్తల్ బస్టాండ్లో ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అడిషనల్ కలెక్టర్ శ్రీను, రెవెన్యూ కలెక్టర్ ఫణిందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మానస హాజరైయ్యారు. ఇంతకుముందు మక్తల్ పట్టణానికి కలెక్టర్ ప్రతీక్ జైన్ కు మంత్రి శాలువాతో సన్మానించారు. విజయవంతమైన మహాలక్ష్మి పథకానికి ఆర్టీసీ అధికారులు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చొరవ చూపడం లేదని ప్రస్తుతం ఏర్పాటు చేసిన వేదికను చూస్తేనే మహాలక్ష్మి పథకంపై ఆర్టీసీ అధికారులకు ఉన్న నిర్లక్ష్యం బయటపడుదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మహిళలు తలెత్తుకొని తిరగడానికి గాను ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి, వారు ప్రయాణించిన దూరానికి ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తున్న విషయాన్ని ఆర్టీసీ అధికారులు ఎందుకు ప్రచారం చేయడం లేదని ఆయన డిపో మేనేజర్ ని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలు సోనియమ్మ పుట్టినరోజు దినాన రాష్ట్ర వ్యాప్తంగా నేటికీ మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణించి.. పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్టీసీకి అందించిందని నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రయాణిస్తున్న మహిళల నుండి రోజు 12 లక్షల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకుంటుందని ఆర్టీసీ లాభాల బాటలో కొనసాగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకొని విజయవంతంగా అమలు చేస్తు ఆర్టీసీకి లాభాలు సమకూరుస్తూన్నా ప్రచారంలో వెనుకబడి ఉందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాలలో మహిళలను భాగస్వామ్యం చేయడం వల్లనే ఆర్థిక వ్యవహారాలన్నీ వారి చేతుల నుండి ఖర్చు చేయడంతోనే కుటుంబం బాగుపడుతుందని.. మారుమూల గ్రామాల నుండి పట్టణాలకు చదువుకోడానికి ఉద్యోగరీత్యా వచ్చే విద్యార్థులకు, ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా బస్సులు తిప్పాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande