
బెంగళూరు,: , 04 మార్చి (హి.స.)
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ రాజకీయ నాయకుడని.. ఇలా అభ్యంతరం చెబుతారని అనుకోలేదని తెలిపారు. కృష్ణా జలాలలో వారి వాటా వారికి వెళ్తోందని చెప్పారు.
మంగళవారం ఇక్కడి విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక చేపట్టే భూసేకరణ ప్రక్రియను ఏపీ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. కేంద్ర జలశక్తి శాఖకు తన అభ్యంతరంతో సమగ్ర లేఖ పంపిందని.. ఎత్తు పెంపునకు అనుమతులు ఇవ్వొద్దని.. గెజిట్ చేయవద్దని అందులో కోరిందన్నారు. దీనిపై జలశక్తి శాఖ కర్ణాటక స్పందన కోరిందని తెలిపారు. తమ రాష్ట్రంలో భూసేకరణపై అభ్యంతరం చెప్పడం ఏపీ ప్రభుత్వానికి ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కర్ణాటక నుంచి 28 మంది ఎంపీలు ఉన్నారని.. అందరూ సమష్టిగా కేంద్ర జలశక్తి మంత్రిని, ప్రధానమంత్రిని కలసి అనుమతులు సాధించాలని, ఒత్తిడి తీసుకురావాలని కోరతామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ