నేటి నుంచి జూన్ 9 వరకు మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.
కామారెడ్డి, 04 మార్చి (హి.స.) మహిళల ఆరోగ్యం బాగుంటే దేశం బాగున్నట్టే అనే కాన్సెప్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ సందర్భంగా వారి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయడానికి సిద్ధపడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో
Medical health


కామారెడ్డి, 04 మార్చి (హి.స.)

మహిళల ఆరోగ్యం బాగుంటే దేశం

బాగున్నట్టే అనే కాన్సెప్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ సందర్భంగా వారి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయడానికి సిద్ధపడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ మిషన్-100 పేరుతో 100 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టీ డయాగ్నస్టిక్స్ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు వైద్యారోగ్య శాఖ, డీఎంఈ, టీవీవీపీ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.

మహిళల కోసం సమగ్రమైన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడం కోసమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. విజన్-2047 లో భాగంగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ 100 రోజుల ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్ తో పాటు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 4 నుంచి జూన్ 9 వరకు నాలుగు విడతల్లో వైద్య ఆరోగ్య శిబిరాలతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

కామారెడ్డి జిల్లాలో సుమారు 18,500 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిబిరాల్లో 30 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించి వారి ఆరోగ్య ప్రొఫైల్ ను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా వారికి హెల్త్ కార్డులు కూడా అందజేయనున్నారు.

కామారెడ్డి జిల్లాలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల పరిధిలో సుమారు 18,500 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించారు. కామారెడ్డిలో ప్రణాళికలు 5వేల మందికి, బాన్సువాడలో 4200 మందికి, ఎల్లారెడ్డిలో 3800 మందికి, దోమకొండలో 2500 మందికి, నాగిరెడ్డిపేటలో 3వేల మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు.

విడతల వారీగా కార్యక్రమాలు ఇలా...

-మొదటి విడతలో (మార్చి 4 నుంచి 31 వరకు) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, కంటి, ఎముకలు, దంత వైద్య నిపుణులు వైద్య సేవలు అందిస్తారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో వృద్ధాప్య చికిత్స శిబిరాలు, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కంటి పరీక్షలు, పోషక ఆహారంపై అవగాహన, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు చేపడతారు.

-రెండో విడతలో (ఏప్రిల్ ఒకటి నుంచి 15 వరకు) క్యాన్సర్ ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించి కేర్ పాలసీని విడుదల చేస్తారు. దీనికోసం రిజిస్ట్రీ ఏర్పాటు చేయడం, ఆరోగ్య మహిళా పథకం కింద స్క్రీనింగ్ క్యాంప్ లు, జిల్లా డే కేర్ క్యాన్సర్ కేంద్రాల్లో కీమో థెరపి సేవల మ్యాపింగ్ చేస్తారు.

-మూడో విడత (ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు) వేసవిలో వచ్చే వడదెబ్బ, అతిసారం వంటి సమస్యలపై దృష్టి పెడతారు. టీబీ (క్షయ) కేసుల గుర్తింపు, పోషక ఆహారం అందించడం, అంటు వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతారు.

-నాలుగవ విడత (మే 16 నుంచి జూన్ 9 వరకు) పట్టణ వాసులతో పాటు గిరిజన వాసుల ఆరోగ్యం పై దృష్టి సారిస్తారు. అర్బన్ పిహెచ్సి లను పాలీ క్లినిక్స్ గా అప్ గ్రేడ్ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా, తల సేమియా, హీమోఫీలియా బాధితులను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande