గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన అడ్డాల గణేష్ కల్తీ పాల సరఫరా
రాజమహేంద్రవరం, 04 మార్చి (హి.స.) ,:కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన అడ్డాల గణేశ్ సరఫరా చేసిన పాలలో ఇథలీన్ గైక్లాన్ కలవడంతో 20మంది తీవ్ర అస్వస్థతకు గురై.. ఐదుగురు మృతిచెందిన విషయం
గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన అడ్డాల గణేష్ కల్తీ పాల సరఫరా


రాజమహేంద్రవరం, 04 మార్చి (హి.స.)

,:కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన అడ్డాల గణేశ్ సరఫరా చేసిన పాలలో ఇథలీన్ గైక్లాన్ కలవడంతో 20మంది తీవ్ర అస్వస్థతకు గురై.. ఐదుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అలాగే మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతున్నవారిలో సోమవారం రాజమహేంద్రవరం లాలాచెరువులోని చౌడేశ్వరనగర్కు చెందిన కె.సత్యనారాయణ((76), మంగళవారం అదే ప్రాంతానికి చెందిన జి.సూర్యారావు (81) మృతి చెందారు. మిగిలిన మరో 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురికి డయాలసిస్ చేస్తున్నారు. పది మంది వెంటిలేటర్పైనే డయాలసిస్ వైద్యం పొందుతున్నారు. వీరిలో రాజేంద్రనగర్కు చెందిన పిచ్చుక నాగేశ్వరరావు(70) ఆరోగ్యం మెరుగు పడినట్టు సమాచారం. మరి కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande