రైల్వే.కోడూరు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్.ను.బెదిరించిన కేసులో హర్ష వీణ కు ముందస్తు బెయిల్
అమరావతి, 04 మార్చి (హి.స.) రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను బెదిరించడంతో పాటు రూ.కోట్లు డిమాండ్ చేసిందనే ఆరోపణలతో నమోదైన కేసులో జూనియర్ అసిస్టెంట్ హర్ష వీణకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస
రైల్వే.కోడూరు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్.ను.బెదిరించిన కేసులో హర్ష  వీణ కు ముందస్తు బెయిల్


అమరావతి, 04 మార్చి (హి.స.) రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను బెదిరించడంతో పాటు రూ.కోట్లు డిమాండ్ చేసిందనే ఆరోపణలతో నమోదైన కేసులో జూనియర్ అసిస్టెంట్ హర్ష వీణకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం ఉత్తర్వులు ఇవ్వగా... తీర్పు ప్రతి మంగళవారం అందుబాటులోకి వచ్చింది. ‘వారం రోజుల్లో సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరై రూ.20వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలి. చార్జ్షీట్ దాఖలు చేసేవరకు ప్రతి శనివారం సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో ముందు హాజరు కావాలి. పాస్పోర్ట్ను కోర్టులో అప్పగించాలి. పాస్పోర్ట్ లేకుంటే ఆమేరకు అఫిడవిట్ వేయాలి. కేసు విచారణకు అందుబాటులో ఉండాలి. దర్యాప్తునకు సహకరించాలి. సాక్షులను బెదిరించడం, ప్రలోభపెట్టడం చేయకూడదు. సంబంధిత కోర్టు అనుమతి లేకుండా జిల్లా దాటి వెళ్లకూడదు’ అంటూ షరతులు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

షరతులు ఉల్లంఘిస్తే... బెయిల్ రద్దుకు చర్యలు తీసుకొనేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ‘నా కుమారుడు, అతని కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్న హర్షవీణ రూ.25 కోట్లు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే ఎమ్మెల్యేతో అక్రమ సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరిస్తోంది’ అంటూ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హర్ష వీణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande