విశాఖపట్నం.భీమిలి బీచ్ రోడ్డులో ప్రైవేటు బస్సు.దగ్దం
(విశాఖపట్నం 04 మార్చి (హి.స.)విశాఖపట్నం-భీమిలి బీచ్రోడ్డులో ప్రైవేటు బస్సు దగ్ధమవడంతో కొద్దిసేపు ఆ మార్గంలో ట్రాపిక్ నిలిచిపోయింది. ఓంకార్ ట్రావెల్స్కు చెందిన బస్సు మంగళవారం ఉదయం విశాఖ నగరంలోని గవర్నర్ బంగ్లా నుంచి భీమిలిలోని ప్రైవేటు పాఠశాలకు బయలు
విశాఖపట్నం.భీమిలి బీచ్ రోడ్డులో ప్రైవేటు బస్సు.దగ్దం


(విశాఖపట్నం 04 మార్చి (హి.స.)విశాఖపట్నం-భీమిలి బీచ్రోడ్డులో ప్రైవేటు బస్సు దగ్ధమవడంతో కొద్దిసేపు ఆ మార్గంలో ట్రాపిక్ నిలిచిపోయింది. ఓంకార్ ట్రావెల్స్కు చెందిన బస్సు మంగళవారం ఉదయం విశాఖ నగరంలోని గవర్నర్ బంగ్లా నుంచి భీమిలిలోని ప్రైవేటు పాఠశాలకు బయలుదేరింది. సుమా రు 8.30 గంటలకు పెదరుషికొండ జంక్షన్ వద్ద పెద్ద శబ్దంతో బస్సు టైరు పేలింది.

ఆ తర్వాత కొద్ది క్షణాలకే బస్సులో మంటలు చెలరేగి దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని బస్సు డ్రైవర్ రాజేశ్ తెలిపారు. టైర్ పేలడం, ఆ వెంటనే మంటలు వ్యాపించడంతో బస్సును రోడ్డు పక్కకుతీసి, తాను కిందికి దూకేశానని చెప్పారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే బస్సు కాలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆరిలోవ సీఐ బాలకృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సులో ప్రైవేటు పాఠశాల విద్యార్థులు టూర్కు వెళ్లాల్సి ఉందని, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande