బాచుపల్లి లో భారీ అగ్ని ప్రమాదం..20 ఫర్నిచర్ షాప్స్ పూర్తిగా దగ్ధం.
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) నిజాంపేట్ సర్కిల్ బాచుపల్లిలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ సర్కిల్ ప్రగతి నగర్ కమాన్ సమీపంలో గల కేజీఆర్ కన్వెన్షన్ను ఆనుకుని రోడ్డు పొడవుగా దాదాపు 30 ఫర్నిచర్ షాప్స్ ఏర్పాటు చేశా
అగ్గి ప్రమాదం


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)

నిజాంపేట్ సర్కిల్ బాచుపల్లిలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ సర్కిల్ ప్రగతి నగర్ కమాన్ సమీపంలో గల కేజీఆర్ కన్వెన్షన్ను ఆనుకుని రోడ్డు పొడవుగా దాదాపు 30 ఫర్నిచర్ షాప్స్ ఏర్పాటు చేశారు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మామ ఈ ల్యాండ్ తనదే అంటూ ప్రతి నెల సుమారు పది లక్షల రూపాయలకు పైగా అద్దె వసూలు చేస్తున్నాడు. అయితే షాప్స్ రోడ్డు పక్కన గల గ్రీనరి భాగంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు. గత ఐదు సంవత్సరాలకు పైగా ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్స్ ఏర్పాటు చేసుకుని కొందరు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు. ఈ ఫర్నిచర్ షాప్స్ లలో ఉన్నటుండి మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగడం ఫర్నిచర్ షాప్స్ ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధం కావడం స్థానికంగా ఆందోళన కలిగించింది.

అగ్ని ప్రమాదంలో సుమారు 20కి పైగా షాప్స్ పూర్తిగా దగ్ధం కాగా సుమారు రూ. 2 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. సమయానికి పోలీస్, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ జరిగే నష్టం జరిగి పోయింది. తన ల్యాండ్ వేరే వాళ్లకి అగ్రిమెంట్ చేశాను. ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లి పోండి అని సదరు ల్యాండ్ ఓనర్ ఫర్నిచర్ షాప్స్ నిర్వాహకులకు గత కొద్ది నెలల నుండి చెబుతున్నట్లు సమాచారం. కొందరు ఖాళీ చేసి వెళ్లిపోగా మరికొందరు స్థలం దొరకలేదు వెళతాం అంటూ అక్కడే వ్యాపారం చేస్తూ వస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్కూట్ వల్ల జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. ఏది ఏమైనా సుమారు 20కి పైగా పేద కుటుంబాలు అగ్ని ప్రమాదంతో రోడ్డున పడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande