ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టుకోసం సీనియర్ ఐఏఎస్ల పోటీ.. జోరుగా లాబీయింగ్
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టు కోసం సీనియర్ ఐఏఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎలాగైనా ఆ పోస్టును దక్కించుకునేందుకు వారు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆ శాఖ మ
కార్యదర్శి పోస్ట్


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత

కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టు కోసం సీనియర్ ఐఏఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఎలాగైనా ఆ పోస్టును దక్కించుకునేందుకు వారు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టిలో పడేందుకు స్పెషల్ సీఎస్లు దాన కిశోర్, మహేశ్ దత్ ఎక్కా తీవ్రంగా కష్టపడుతున్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జరిగిన బదిలీల్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ సెక్రెటరీగా ఉన్న సంజయ్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో ఎన్.శ్రీధర్ను నియమించింది. కానీ ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడంతో ఆ శాఖ ప్రస్తుతం సీఎస్ వద్దే ఉన్నది.

ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ చాలా కీలకమైనది. ఆ శాఖ బాధ్యతలు చూసే సెక్రెటరీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడుతాయి. దీంతో es శాఖలో పనిచేయాలని చాలా మంది ఐఏఎస్లు పోటీ పడతారు. ప్రస్తుతం సీఎస్ వద్ద ఉన్న ఈ శాఖను ఇతరులకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతున్నది. విషయాన్ని గ్రహించిన స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న దానకిశోర్, మహేశ్ దత్ ఎక్కా ఆ పోస్టును సొంతం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు సన్నిహితుల ద్వారా లాబీయింగ్ చేసిన సదరు ఐఏఎస్లు.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

కాగా.. పోటీపడుతున్న ఆ ఇద్దరు అధికారుల పనితీరుపై సీఎంవో దగ్గర నెగెటివ్ రిపోర్టులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో దాన కిశోర్కు అత్యంత కీలకమైన మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన సీఎం ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో పాటు కొన్ని సమస్యలు సృష్టించారనే కారణంతో అక్కడి నుంచి తప్పించి, కార్మిక శాఖ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. అలాగే, మైనింగ్ శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖ సెక్రెటరీగా ఎక్కాను నియమిస్తే.. సీఎం ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ చూపించకపోవడంతో అక్కడి నుంచి బదిలీ చేశారనే చర్చ అప్పట్లో జరిగింది. దీంతో ఆ ఇద్దరిలో ఎవరికి ఐటీ, ఇండస్ట్రీశాఖ శాఖ బాధ్యతలు ఇస్తారోననే ఆసక్తి నెలకొన్నది. మరోవైపు ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు కొందరు మహిళా ఐఏఎస్లు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande