తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర: నెలాఖరులోగా కమిటీల భర్తీకి సన్నాహాలు..
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పార్టీ పదవుల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. ఈనెలాఖరులోగా ముఖ్యమైన పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడానికి షెడ్యూలఖరారు చేశారు. ఈ మేరకు పదిరోజుల శిక్షణ సందర్భంగా జిల్లా
Telangana Congress


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)

కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పార్టీ పదవుల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. ఈనెలాఖరులోగా ముఖ్యమైన పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడానికి షెడ్యూలఖరారు చేశారు. ఈ మేరకు పదిరోజుల శిక్షణ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు తేదీలను ఖరారు చేసి పేర్లు ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఈనెల 15లోగా డీసీసీ కార్యవర్గం, మండల, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షల నియామకం, 16వ తేదీ నుంచి 25లోగా మండల, బ్లాక్ కాంగ్రెస్ల కార్యవర్గం ఖరారు, ఏప్రిల్ 1 నుంచి 30లోగా బూత్ లెవల్, గ్రామ పంచాయతీ స్థాయిలో అధ్యక్షులు, కార్యవర్గాల నియామకం చేయనున్నారు. డీసీసీలు వెంటనే పేర్లు ఇస్తే మరొకసారి సామాజిక సమీకరణాలను సరిచూసి ప్రకటించనున్నారు. వివాదాలకు తావు లేకుండా పార్టీలో మొదటి నుంచి పనిచేసినవారికి, ఇప్పటివరకు అవకాశం రానివారికి, ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అన్ని స్థాయిల కమిటీల నియామకం తర్వాత జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏఐసీసీ పెద్దలు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర నేతలు వచ్చే నెల 15వ తేదీ డెడ్లైన్ పెట్టుకొని భర్తీకి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటుగా రాష్ట్రస్థాయిలో కుల సంఘాల ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే వీటికి సంబంధించి పేర్లు తీసుకున్నా కొలిక్కి రావడం లేదు. మహిళా కమిషన్ చైర్మన్, డైరెక్టర్ పోస్టుల కోసం వందల సంఖ్యలో మహిళలు ఎదురుచూస్తున్నారు. కాగా దీనిపై పార్టీ, ప్రభుత్వం ఇంకా ఆలోచించలేదని సమాచారం. ఈనెలాఖరు లేదా ఏప్రిల్లో కులసంఘాల పోస్టులను భర్తీ చేస్తారని చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగియనుండగా అప్పుడే భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande