హైకోర్టు జడ్జీలుగా సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు
దిల్లీ: , 09 మార్చి (హి.స.)హైకోర్టు న్యాయమూర్తి పదవుల కోసం జిల్లా, హైకోర్టు పరిధిలో అర్హులైన మహిళా న్యాయమూర్తులు లేరని భావించినప్పుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఆయా రాష్ట్రాల మహిళా న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్
హైకోర్టు జడ్జీలుగా సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు


దిల్లీ: , 09 మార్చి (హి.స.)హైకోర్టు న్యాయమూర్తి పదవుల కోసం జిల్లా, హైకోర్టు పరిధిలో అర్హులైన మహిళా న్యాయమూర్తులు లేరని భావించినప్పుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఆయా రాష్ట్రాల మహిళా న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. హైకోర్టు కొలీజియంలకు సూచించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘న్యాయవ్యవస్థలో భారతీయ మహిళలు’ అన్న అంశంపై సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా ఆయన ప్రసంగించారు. ‘‘తిరోగమన వలసవాదుల పాలనలో మహిళలను కనీసం న్యాయవాద వృత్తి చేపట్టడానికీ అనుమతించేవారుకాదు. ఇప్పటికీ వ్యవస్థల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం సాకారం కాలేదు. అడ్డంకులన్నింటినీ అధిగమించి ఎంతోమంది మహిళా న్యాయవాదులు ప్రతిభ చాటుకున్నారు. మహిళలను ఉన్నత న్యాయమూర్తులుగా నియమించడం అప్పటికప్పుడు సాధ్యంకాదు. అందుకు దారితీసే అన్ని మార్గాలనూ సరిదిద్దాలి. న్యాయమూర్తుల పోస్టులకు తగిన ప్రతిభావంతులైన మహిళలు ఉన్నప్పుడు వారిని పరిగణనలోకి తీసుకొనే విధానాన్ని అలవరుచుకోవాలి’’ అని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande