ఎన్టీఆర్ జిల్లాలో.గ్యాస్ కొరత లేదు
అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.) ఎన్టీఆర్ కలెక్టరేట్, : జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ ఎస్.ఇలక్కియా తెలిపారు. అవసరమైతేనే బుకింగ్లు చేయాలని సూచించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు వె
ఎన్టీఆర్ జిల్లాలో.గ్యాస్ కొరత లేదు


అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.)

ఎన్టీఆర్ కలెక్టరేట్, : జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ ఎస్.ఇలక్కియా తెలిపారు. అవసరమైతేనే బుకింగ్లు చేయాలని సూచించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు వెల్లడించారు. సోమవారం నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. నగరంలోని కలెక్టరేట్లో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 8,63,778 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. 18 హెచ్పీసీఎల్, 12 బీపీసీపీఎల్, 26 ఐవోసీఎల్లకు సంబంధించి మొత్తం 56 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని పేర్కొన్నారు. మార్చి 30న 15,186 బుకింగ్లు జరగ్గా, అదే రోజున 19,440 సిలిండర్ల డెలివరీ జరిగాయని వివరించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande