
న్యూఢిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.)అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను( ) టీడీపీ ఎంపీలు ఈరోజు(బుధవారం) ఉదయం కలిశారు. అమరావతి చట్టబద్ధత బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టిన వెంటనే చర్చకు అనుమతించాలని స్పీకర్ను ఎంపీలు కోరారు. అయితే ఈ బిల్లుపై 1 గంట తరువాత చర్చకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. 12 గంటలకు కేంద్ర వాణిజ్యశాఖకు చెందిన జన విశ్వాస్ బిల్లుపై చర్చ ఉందని స్పీకర్ తెలియజేశారు. కావాలంటే కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడాలని టీడీపీ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా సూచించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసేందుకు ఆయన ఛాంబర్కు టీడీపీ ఎంపీలు వెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ