భయపడెతున్న కరోనా కొత్త వేరియంట్ సికాడా
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది..! ‘సికాడా’ (బీఏ.3.2) అనే కొత్త వేరియంట్ రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తోంది. అమెరికా సహా 20కిపైగా దేశాల్లో సికాడా వేరియంట్ విస్తరిస్తున్నట్టు గుర్తించారు.
corona


ఢిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.)

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది..! ‘సికాడా’ (బీఏ.3.2) అనే కొత్త వేరియంట్ రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తోంది. అమెరికా సహా 20కిపైగా దేశాల్లో సికాడా వేరియంట్ విస్తరిస్తున్నట్టు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ కారణంగా భారత్లో కొవిడ్ కేసుల్లో ఎలాంటి పెరుగుదలా కనిపించనప్పటికీ.. ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. బీఏ.3.2గా పిలిచే ఈ సికాడా వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినది. 2022లోనే కనుమరుగైన ఈ ఒమిక్రాన్ జాతి తాజాగా మళ్లీ రూపాంతరం చెంది పుట్టుకొచ్చింది. దీని స్పైక్ ప్రోటీన్లో 70-75కిపైగా మార్పులు (మ్యుటేషన్స్) సంభవించాయి. సాధారణ కొవిడ్ వేరియంట్ల కంటే ఇది భిన్నంగా ఉండడం ఆందోళన రేపుతోంది..! గతంలో వచ్చిన వ్యాక్సిన్లు లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా మన శరీరంలో ఏర్పడిన యాంటీబాడీల నుంచి ఇది సులభంగా తప్పించుకునే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు భావిస్తున్నారు.

పాత ఒమిక్రాన్రకాలతో పోలిస్తే ఇది వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వైర్సలోని ఉత్పరివర్తనాలు మరింత ప్రాణాంతకంగా మారొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ను అమెరికాలో గుర్తించారు. యూరప్, ఆసియా దేశాల్లోనూ ఈ వైరస్ బయటపడింది. ఈ కొత్త వేరియంట్ వల్ల కొవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నట్టు ఎక్కడా నమోదుకాలేదు. సికాడా వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ముక్కుకారడం, ముక్కు దిబ్బడ, కొందరిలో తలనొప్పి, ఒళ్లునొప్పులు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిని గుర్తించారు. బీఏ.3.2 తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని సూచించే ఆధారాలేమీ ఇప్పటికి లేవు. భారత్ విషయానికొస్తే ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని నిపుణులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande