
హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)
భారతదేశ టెలికాం రంగం పరుగులు
కొనసాగుతూనే ఉన్నాయి. ట్రాయ్ (TRAI) నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 2026 చివరి నాటికి దేశంలోని మొత్తం టెలిఫోన్ వినియోగదారుల ລ້ 1,321.31 మిలియన్లకు (132.13 కోట్లు) చేరుకుంది. కేవలం ఫిబ్రవరి నెలలోనే రికార్డు స్థాయిలో 7.31 మిలియన్ల కొత్త చందాదారులు నెట్వర్క్ చేరారు. బ్రాడ్బ్యాండ్ విభాగంలో చోటుచేసుకున్న భారీ వృద్ధి ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచినట్లు తెలుస్తుంది. దేశంలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య జనవరిలో 1,052.72 మిలియన్లు ఉండగా, ఫిబ్రవరి నాటికి అది 1,059.05 మిలియన్లకు పెరిగినట్లు సమాచారం.
బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో రిలయన్స్ జియో 519.64 మిలియన్ల చందాదారులతో తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు ట్రాయ్ (TRAI) నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్త టెలి-డెన్సిటీ (Tele-density) 92.66 శాతానికి చేరుకోగా, పట్టణ ప్రాంతాల్లో ఇది అత్యధికంగా 142.32 శాతంగా నమోదైంది.
మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (MNP) జోరు...
వినియోగదారులు తమకు నచ్చిన నెట్వర్కు మారే ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఫిబ్రవరి నెలలో ఏకంగా 14.47 మిలియన్ల మంది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (MNP) కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ పెరుగుతుండటం టెలికాం రంగ విస్తరణకు నిదర్శనంగా కనిపిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..