ప్యాషన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు.....
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో ప్యాషన్ ఫ్రూట్ ఒకటి, ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది
8 Incredible Health Benefits of Passion Fruit You Shouldn't


అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.)ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో ప్యాషన్ ఫ్రూట్ ఒకటి, ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పులుపు, తీపి కలయికతో ఉండే ఈ పండులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో ప్యాషన్ ఫ్రూట్ ఒకటి, ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పులుపు, తీపి కలయికతో ఉండే ఈ పండులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

ప్యాషన్ ఫ్రూట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను నివారించి ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం.

గుండె పదిలం..

గుండె ఆరోగ్యానికి కూడా ప్యాషన్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి, తద్వారా గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. చర్మ సౌందర్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ పండు ఒక వరం లాంటిది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి, వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది.

ఈ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక షుగర్ లెవల్స్ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. షుగర్ను నియంత్రణలో ఉంచుకునేందుకు సహాయం చేస్తాయి. . మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా ప్యాషన్ ఫ్రూట్ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande