
హైదరాబాద్, 01 ఏప్రిల్ (హి.స.)
ఏప్రిల్ 1వ తేదీ నుంచి అనగానేటి నుండి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అమలులోకి రావడం జరిగింది. ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ధరలు హెచ్చుతగ్గులు కావడం, లేదా బ్యాంకులకు సంబంధించిన ఏదైనా అప్డేట్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇవాల్టి నుంచి కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు కేవలం ఓటీపీ ద్వారా మనం చేసేవాళ్లం. కానీ ఇకపై ప్రతి ట్రాన్సాక్షన్ కు పిన్/పాస్ వర్డ్, రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ లాంటివి కనీసం రెండు ఉండాలి. సైబర్ స్కాంలను నియంత్రించేందుకు గాను ఈ చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే ఇండియాలోని అన్ని పెట్రోల్ బంక్ ల్లో E-20 పెట్రోల్ తప్పనిసరి చేసింది కేంద్రం. కేవైసీ చేయని ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. ఇక కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు నిర్వహణ చార్జీలను అమాంతం పెంచేశాయి. అలాగే ఇకపైన కొత్త బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే గోల్డ్ లోన్ రీ-పేమెంట్ గడువు 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..