ఎల్పిజీ సిలిండర్ ధరల్లో ఏమార్పు లేదు
జాతీయ భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా, ఏప్రిల్ 1 నుంచి చైనాలో తయారైన సీసీటీవీ కెమెరాలపై భారతదేశం నిబంధనలను కఠినతరం చేసింది.
Gas cylinders


డిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.)

సిలిండర్ ధరల(LPG Prices)ను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచేశాయి. కొత్త ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. 19 కేజీల సిలిండర్లపైనే ధరలను పెంచారు. కానీ 14.2 కేజీల ఎల్పీజీ డొమెస్టిక్ సిలిండర్లపై ధరలను మాత్రం పెంచలేదు. ఇది సామాన్యులకు ఊరటను ఇచ్చే అంశమే. ఏప్రిల్ నెలలో 14.2 కేజీల సిలిండర్లపై ధరలో మార్పు ఉండబోదని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఎందుకంటే గత నెలలోనే 14 కేజీల సిలిండర్పై సుమారు రూ.60 పెంచారు. దీంతో మెట్రో నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ రేట్లు పెరిగాయి. ఏప్రిల్ 2025 తర్వాత తొలిసారి గత నెలలోనే 14 కేజీల సిలిండర్పై ధరలను పెంచడం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం.. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర మాత్రం ఢిల్లీలో రూ. 913గానే ఉంటుంది. కోల్కతాలో 939, ముంబైలో 912.5, చెన్నైలో 928.5గా ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande