
ముంబై, 01 ఏప్రిల్ (హి.స.)
కొత్త ఆర్థిక సంవత్సరానికి భారతీయ
స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో (2026-27) ఘనస్వాగతం పలికాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పరుగులు తీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) ఏకంగా1900 పాయింట్లకు పైగా లాభపడి 73835 మార్కును అధిగమించగా, నిఫ్టీ-50 (Nifty-50) 570 పాయింట్ల వృద్ధిని నమోదు చేసి 22,910 పైన ట్రేడ్ అవుతోంది. ఈ భారీ జంప్తో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు పెరగడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు