
అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.)కొలిమిగుండ్ల, అవుకు, సంజామల మండలాల నుంచి రవాణా అవుతున్న నాపరాయి, గ్రావెల్, కంకర వాహనాలను ఆపి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. బిల్లు అడిగితే తెల్ల కాగితంపై రాసి పంపిస్తున్నారు.
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ పనులకు రాళ్ల మట్టిని తరలిస్తున్న వాహనాలను ఆపి కొన్ని నెలలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ట్రాక్టరుకు రూ.200, టిప్పరు, లారీకి రూ.1500 వరకు తీసుకొంటున్నారు. గనుల వద్దే సీనరేజీ వసూలు చేయాల్సి ఉండగా మార్గమధ్యలో వాహనాలను ఆపి అనధికారికంగా డబ్బులు వసూళ్లు చేస్తుండటం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో ఖనిజ సీనరేజీ వసూళ్ల బాధ్యత ఓ గుత్తేదారు సంస్థ తీసుకుంది. ఓవైపు అక్రమ తవ్వకందారులతో ‘ఒప్పందం’ కుదుర్చుకొని ముందస్తు బేరం చేయడం.. నిబంధనలకు విరుద్ధంగా ‘గేట్ల’ వద్ద వసూలు చేయడంపై రవాణాదారులు మండిపడుతున్నారు. తెల్ల కాగితంపై బిల్లులు రాసి ఇస్తున్నారు. వీటిపై ఎలాంటి సీలు ఉండటం లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ