మళ్లీ సీన్ రివర్స్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి
Gold


ముంబై, 01 ఏప్రిల్ (హి.స.)బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్స్టాప్ పెరుగుతున్నాయి. అయితే.. ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్షా 60 వేల మార్క్ .. మళ్లీ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే.. మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. పలు వెబ్సైట్ల ఆధారంగా.. బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,970 పెరిగి.. రూ.1,51,480 కి ఎగబాకింది.

22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధరపై రూ.1,800 లు పెరిగి.. రూ.1,38,850 గా ఉంది.

వెండి కిలో ధర రూ.2,64,900 గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,480, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,38,850 ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,51,480, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,38,850 ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,51,630, 22 క్యారెట్ల ధర రూ.1,39,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,480, 22 క్యారెట్ల ధర రూ.1,38,850 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande