మహిళా రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు: కిషన్రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన ఎక్స్ పోస్టుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు.
Kishan reddy


హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన ఎక్స్ పోస్టుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్లపైన సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని తెలిపారు. 15, 16, 17 తేదీల్లో పార్లమెంట్లో జరిగే చర్చలో అందరు ఎంపీలు మాట్లాడవచ్చని వెల్లడించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. మహిళా రిజర్వేషన్లపై రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్ని కోరారు.

దశాబ్దాలుగా కాంగ్రెస్ పరిపాలన చేసిందని.. అంబేడ్కర్ చెప్పిన మహిళల రిజర్వేషన్ల గురించి ఎందుకు పట్టించుకోలేదని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు రిజర్వేషన్లు తీసుకువస్తుంటే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 70 కోట్ల మంది మహిళల గౌరవాన్ని పెంచాలని.. వారికి హక్కులు కల్పించాలని రిజర్వేషన్లు తీసుకువస్తున్నామని చెప్పారు. తాము దక్షిణాదిలోనే ఉన్నామని.. ఎవరికీ అన్యాయం జరగకుండా మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటే డీలిమిటేషన్ చేయాల్సిందేనని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు మహిళా రిజర్వేషన్లకు సహకరించాలని కోరారు. పూర్తిస్థాయి సెన్సెస్ రావాలంటే రెండు సంవత్సరాల సమయం పడుతుందని.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడవద్దని హితవు పలికారు. వారానికి ఒకసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి ఎందుకు వెళ్తున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్న ఢిల్లీకి కట్టలు మోయాలని విమర్శించారు. బీజేపీ విధానం అది కాదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని కిషన్రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande