కొత్తజాల లో రేషన్ షాప్ ప్రారంభం
కొత్తజాల లో రేషన్ షాప్ ప్రారంభమైంది
కొత్తజాల లో రేషన్ షాప్ ప్రారంభం


రాజాపేట, 13 ఏప్రిల్ (హి.స.)

మండలంలోని కొత్తజాలలో సోమవారం తాత్కాలిక రేషన్ షాపును గ్రామ సర్పంచ్ ఠాకూర్ లావణ్య ధర్మేందర్ సింగ్, తాసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాత్కాలిక రేషన్ షాప్ ఏర్పాటు చేయడంతో సరుకుల కోసం దూర భారం తగ్గిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఠాకూర్ ధన్ రాజ్ సింగ్, వార్డు సభ్యులు మొగిలి యాకయ్య, కాకాల్ల భాగ్య ఐలయ్య, మొగిలి చంద్రయ్య, కాయతి వందన వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande