
హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు,ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి (one go) పంపిణీ చేస్తుండటంతో రాష్ట్రంలోని రేషన్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే రేషన్ పంపిణీలో తలెత్తిన వివిధ సమస్యల వల్ల ఈ ప్రక్రియను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తునట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి మూడు నెలల కోటాను పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల తాకిడి పెరిగి, భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీనికి తోడూ, e-POS మెషీన్లలో సాంకేతిక లోపాలు (technical glitches), సర్వర్ స్లో ప్రాసెసింగ్ సమస్యలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. హైదరాబాద్ పాటు పలు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో, లబ్ధిదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి పౌర సరఫరాల శాఖ ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ e-POS మెషీన్లలో సాంకేతిక సమస్యలు ఎదురైతే, లబ్ధిదారులు ఆందోళన చెందకుండా సమీపంలోని మండల రేషన్ కార్యాలయాన్ని (MRO office) లేదా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..