
జోగులాంబ గద్వాల, 13 ఏప్రిల్ (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. సోమవారం గద్వాల శారద పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల హాజరు వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం, మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను పోలీస్ ఎస్కార్ట్ స్థానిక పోస్టాఫీసులో డిపాజిట్ చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..