ఈ నెల 26.వ తేదీ నుంచి ద్వారక. తిరుమల చిన.వెంకన్న బ్రహ్మోత్సవాలు
ఏలూరు, 14 ఏప్రిల్ (హి.స.) ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 3వ తేదీతో ఈ బ్రహోత్సవాలు ముగుస్తాయి. 26వ తేదీన స్వామి అమ
dwaraka


ఏలూరు, 14 ఏప్రిల్ (హి.స.)

ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 3వ తేదీతో ఈ బ్రహోత్సవాలు ముగుస్తాయి. 26వ తేదీన స్వామి అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి కూతుర్లుగా అలంకరిస్తారు. 27న అంకురార్పణ, ధ్వజారోహణ చేస్తారు. 29వ తేదీన ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. మే 1వ తేదీన స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు. మే 3వ తేదీన వసంతోత్సవం చూర్ణోత్సవం, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవలతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి ఆలయంలో నిత్యం జరిగే ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణాలు రద్దు చేయనున్నట్లు దేవస్థానం ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాలకు చిన్న తిరుపతికి భారీగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు చిన్న తిరుపతి దేవస్థానంలో పాలక మండలి కమిటీని ఇటీవలే ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

హిందూస్తాన్ సమచార్


 rajesh pande