
ఢిల్లీ:, 14 ఏప్రిల్ (హి.స.)
ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ఎక్స్ప్రెస్వే(Delhi-Dehradun Expressway)ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. సుమారు 11,868 కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టారు. 212 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. దీన్ని ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్గా కూడా పిలుస్తున్నారు. యూపీలోని షమరాన్పూర్ అటవీ ప్రాంతంలో ఎక్స్ప్రెస్వే కోసం బ్రిడ్జ్లను నిర్మించారు. డెహ్రాడూన్ సమీపంలో ఉన్న జై మా దాత్ కాళి ఆలయంలో మోదీ పూజలు చేయనున్నారు. దేశరాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు ఈ ఎక్స్ప్రెస్ వేతో ప్రయాణ సమయం తగ్గనున్నది. ఆరు గంటలు పట్టే సమయాన్ని తగ్గించారు. ఇప్పుడు కేవలం రెండున్నర గంటల్లోనే డెహ్రాడూన్ చేరుకుంటారు. ఛార్థామ్ యాత్రికులకు ఇది కీలక రోడ్డుమార్గం కానున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi