
ముంబై, 16 ఏప్రిల్ (హి.స.)బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బ్యాడ్ న్యూస్గా చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బంగారం ధరలపై వాటి ప్రభావం పడుతోంది.
ఈ వారంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. సోమవారం నుంచి ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. దీంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో పసిడి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రేట్లు పెరగడం బ్యాడ్న్యూస్గా చెప్పవచ్చు. గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గురువారం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,55,570 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,55,350 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోల్చుకుంటే రూ.220 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,600 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,42,400 వద్ద కొనసాగింది. నిన్నటితో చూస్తే రూ.200 పెరిగింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV