గంటల్లోనే మారిన రేట్లు.. వేలల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయతృతీయ వేళ బిగ్ షాక్..
పెరిగిన బంగారం ధరలు
Gold


ముంబై, 18 ఏప్రిల్ (హి.స.)

పసిడి ప్రియులకు షాకిస్తూ బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగాగంటల వ్యవధిలోనే ధరల్లో భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.810 పెరిగి రూ.1,55,780 కు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,42,800 వద్ద కొనసాగుతోంది. కేవలం గ్రాము బంగారంపైనే దాదాపు రూ.75 నుండి రూ.81 వరకు పెరుగుదల కనిపించడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

విజయవాడలో కూడా హైదరాబాద్కు సమానంగా ధరలు ఉండగా, చెన్నైలో పసిడి రేట్లు మరికాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,56,160 వద్ద ట్రేడ్ అవుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande