బడంగ్పేట్ అవినీతి కేసు.. 10 మంది అధికారులపై వేటు
బడంగ్పేట్ అవనీతి కేసులో అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు.
Badangpet


హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)జీహెచ్ఎంసీ బడంగ్పేట్ అవనీతి కేసులో పది మంది అధికారులపై వేటు పడింది. జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్లో ఇంజనీరింగ్, సానిటేషన్, ఈవెంట్ పనులలో పెద్దుఎత్తున అవినీతి జరిగినట్లు జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం, ఏసీబీ విచారణలో తేలింది. అధికారులు కోట్లాది రూపాయలకు సంబంధించిన పనులను చేయకుండానే బిల్లులు నొక్కి, నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 10 మంది అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande