
నేరేడుచర్ల, 02 ఏప్రిల్ (హి.స.)మునిసిపాలిటీలు కేంద్రంగా కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జిల్లాలో ఐదు మునిసిపాలిటీలకు నాలుగు మునిసిపాలిటీలు నియోజకవర్గ కేంద్రాలుగా ఉన్నాయి. ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరేడుచర్లను కూడా నియోజకవర్గం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాలతో పాటు పెనపహాడ్ లేదా నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలాలను కలుపుకుంటే నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయవచ్చంటున్నారు. ఒకవేళ జిల్లా పరిధిని ప్రాతిపదికన తీసుకుంటే నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు, పెనపహాడ్ మండలాలను కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలంటున్నారు.
నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు, పెనపహాడ్ మండలాలను కలుపుతూ నియోజకవర్గంగా చేస్తే 1,38,468మంది ఓటర్లు ఉం టారు. పెనపహాడ్గా బదులుగా దామరచర్ల, అడవిదేవులపల్లిని కలిపితే 1,47.750 మంది ఓటర్లు ఉంటారు. నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, పెనపహాడ్, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలను కలిపితే 1,82,066 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాతిపదికనైనా నియోజకవర్గం చేయడానికి అర్హత ఉంటు ందని పేర్కొంటున్నారు.
ఇదిలాఉండగా మిర్యాలగూడ సమీప ప్రాంతాలను కలుపుతూ జిల్లా కేంద్రం చేయాలని ఇప్పటికే ఉద్యమం ఊపందుకుంది. అదే జరిగితే మిర్యాలగూడ జిల్లాలో నేరేడుచర్ల మరొక అసెంబ్లీ స్థానం ఏర్పాటుకావడానికి కూడా అన్ని అర్హతలు ఉం టాయంటున్నారు.
ఇప్పటికే కొందరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ పార్టీల నేతలు ఈ అంశంపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేరేడుచర్ల కేంద్రంగా నియోజకవర్గంగా ఏర్పా టైతే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరుగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్