
హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ
ఐప్యాక్ (I-PAC) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇది అధికారులు ఇవ్వాల ఉదయం నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐప్యాక్ ప్రధాన కార్యాలయాలతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకుల నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లోని ఐప్యాక్ కార్యాలయాలపై ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు.
మనీలాండరింగ్ కోణంలో విచారణ..
బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసులో భాగంగా గత కొంతకాలంగా ఐప్యాక్ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచిన ఈడీ అధికారులు, మనీలాండరింగా జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రాజకీయ వ్యూహాల కోసం వివిధ పార్టీల నుండి అందుకున్న నిధుల మళ్లింపుపై ప్రధానంగా దృష్టి సారించారు. విదేశీ నిధుల సమీకరణలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు