
నాగర్ కర్నూల్, 02 ఏప్రిల్ (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ లో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా రూ. 2400 చెల్లిస్తూ, రైతులకు చర్యలు చెల్లింపులు తక్షణమే జరిగేలా తీసుకుంటున్నామని చెప్పారు.
అలాగే, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు నిరంతరం కొనసాగించాలని, మార్కెట్ యార్డ్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని, సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు