
న్యూఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)
ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లుపై రాజసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇది అమరావతి రైతుల విజయమని ఆమె తెలిపారు. 12 ఏళ్ల తర్వాత ఈ బిల్లు మళ్లీ రావడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఎంత వేధించిన వెనక్కి తగ్గకుండా నిరసనను వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని రేణుకా చౌదరి తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ హామీని కూడానిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు.
ఐదు గ్రామాలను తెలంగాణను ఇవ్వాలని కోరారు. తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నా వాళ్లను ఏపీలో కలిపారని చెప్పారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు