
హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)
మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) డిస్మిస్ చేసింది. దీంతో మూసీ ప్రక్షాళన పనులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది.
ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించిన ట్రిబ్యూనల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు