
కేరళ, 02 ఏప్రిల్ (హి.స.)
భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో దశాబ్దాల పాటు అలరించిన గాన గంధర్వుడు S. P. బాలసుబ్రహ్మణ్యంకు కేరళలో అరుదైన గౌరవం దక్కింది. పాలక్కాడ్లోని వి.టి. భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్లో ఆయన 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విశేషంగా జరిగింది. సంగీతానికి భాషా, ప్రాంతీయ భేదాలు లేవని మరోసారి కేరళ ప్రజలు నిరూపించారు. పరభాషా గాయకుడైనప్పటికీ ఎస్పీబీపై తమకున్న అపారమైన అభిమానాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా తెలియజేశారు. ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ రూపొందించిన ఈ విగ్రహం అభిమానులను ఆకట్టుకుంటోంది
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi